Breaking News

దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు: భట్టి

Published on Tue, 11/19/2024 - 12:00

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ స్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్‌ ఇచ్చారు.

దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. 

దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..
దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్‌గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.

‘ఇందిరమ్మ  స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ  ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.

తెలంగాణ వైపు దేశం చూపు..
బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం  రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం.  కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,

యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది..
బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు.  బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?  పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది.  జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)