Breaking News

పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు: భట్టి విక్రమార్క

Published on Sun, 05/25/2025 - 02:03

వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్‌–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు. 

తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్‌ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. 

బీఆర్‌ఎస్‌ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్‌మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)