Breaking News

‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్‌ పవార్‌ డుమ్మా!

Published on Fri, 11/15/2024 - 08:39

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.

గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌, పాన్వెల్‌లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్‌ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.

ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్‌ పవార్‌ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్‌, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.

ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్‌ పవార్‌ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్‌ పవార్‌.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్‌ చేస్తా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)