Breaking News

సీఎం కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు

Published on Sat, 01/13/2024 - 09:32

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా నాలుగోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 18 విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. జనవరి 3న మూడోసారి ఈడీ ఇచ్చిన సమన్ల విచారణకు సీఎం కేజ్రీవాల్‌ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈడీ పంపిన సమన్లు చట్టపరమైనవి కావని, కేవలం తనను అరెస్ట్‌ చేయడమే లక్ష్యంగా జారీ చేసినవి కేజ్రీవాల్‌ మండిపడ్డ విషయం తెలిసిందే. 

ఇక గతంలో ఈడీ నవంబర్‌2, డిసెంబర్‌ 21న సీఎం కేజ్రీవాల్‌కు.. రెండుసార్లు సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఈసారైనా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ సమన్లకు స్పందించి విచారణ వెళ్లుతారో? లేదో? అని ఆప్‌ పార్టీలో చర్చజరుగుతోంది.

చదవండి: తిరస్కరణ సీఎంను కాదు.. మాజీ సీఎంను: శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)