Breaking News

కడిగిన ముత్యంలా బయటకొస్తా.. కవిత సంచలన ఆరోపణలు

Published on Tue, 03/26/2024 - 12:07

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు. ఈడీ తనపై పెట్టింది మనీలాండరింగ్‌ కేసు కాదని.. ఇది పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు అని అన్నారామె. ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ వ్యాఖ్యానించారు. 

ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నేను తప్పుచేయలేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మనీల్యాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ ల్యాండరింగ్‌ కేసు.  తాత్కాలికంగా నన్ను జైల్లో పెడతారేమో.. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బ తీయలేరు.

.. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరో నిందితుడికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాడు. ఇది తప్పుడు కేసు. క్లీన్‌గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు.  జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేస్తూ కోర్టు హాల్‌లోనికి వెళ్లారు. మరోవైపు ఆమె మద్దతుదారులు, బీఆర్‌ఎస్‌ నేతలు కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కనిపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)