Breaking News

దేశానికి అత్యున్నత నేతలను అందించిన ఢిల్లీ

Published on Sat, 05/25/2024 - 07:54

దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన పలువురు నేతలు ఢిల్లీ తమకు రన్ వే అని నిరూపించారు. ఇక్కడి నుంచి గెలిచిన పలువురు నేతలు రాజకీయాల్లో తారాస్థాయికి చేరుకున్నారు. ఢిల్లీలో విజయం సాధించాక తొలిసారిగా లోక్‌సభకు ముగ్గురు నేతలు చేరారు. వీరిని కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు వరించాయి.  

ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, దేశ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుచేతా కృపలానీ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఆమె 1952లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత ఆమె 1960లో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. మూడేళ్ల తరువాత 1963లో ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా సుచేతా కృపలానీ నిలిచారు.

బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ అద్వానీ కూడా తొలిసారిగా 1989లో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోకి ‍ప్రవేశించారు. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత దేశానికి ఉప ప్రధానిగా కూడా నియమితులయ్యారు. 1991లో న్యూ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేష్ ఖన్నాను ఓడించారు. ఈ క్రమంలోనే 1977లో లాల్‌ కృష్ణ అద్వానీ కేంద్ర మంత్రి కూడా అయ్యారు.

బీజేపీ దిగ్గజ నేత, ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లోక్‌సభకు చేరుకున్నారు. 1996లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆమె దక్షిణ ఢిల్లీ  నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత ఆమె 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దీని తరువాత ఆమె 1998లో దక్షిణ ఢిల్లీ నుంచి మరోమారు గెలిచారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో సాహిబ్ సింగ్ స్థానంలో బీజేపీ ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. 2009-2014 మధ్యకాలంలో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్‌ విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)