Breaking News

ఢిల్లీ బీజేపీ తుది మేనిఫెస్టోలో కీలక హామీలివే..

Published on Sat, 01/25/2025 - 16:59

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను  బీజేపీ ప్రకటించింది. శనివారం(జనవరి25) కేంద్రమంత్రి అమిత్‌ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ‘బీజేపీ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు లేవు. ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉంది. ఢిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్‌ ప్రభుత్వం విఫలమైంది.

కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఢిల్లీలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్‌పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందించింది. 

పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయం. చేసిన వాగ్దానాలను కచ్చితంగా మా పార్టీ అమలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తాం. గిగ్‌ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం, యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. 

రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తాం’ అని అమిత్‌షా హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్‌ సిలిండర్లు  లాంటి కీలక హామీలిచ్చింది. ఈ ఎన్నికల్లో  ప్రధాన  పోటీ బీజేపీ, ఆప్‌ మధ్యే ఉండనుంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)