Breaking News

బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు

Published on Fri, 11/22/2024 - 09:59

సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ​కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్‌లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్‌ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్‌లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.

స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్‌లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)