Breaking News

పవన్‌.. సీజ్‌ ది షిప్‌ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు

Published on Sat, 12/28/2024 - 13:43

సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్‌ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్‌ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్‌ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్‌కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్‌కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.

ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్‌ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్‌కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.

చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్‌కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)