Breaking News

‘అప్పుడు చెంబెడు నీళ్లు.. మట్టి తెచ్చారు..ఈసారి అదీ లేదు’

Published on Thu, 05/29/2025 - 19:27

నంద్యాల జిల్లా:  టీడీపీ  నిర్వహించిన మహానాడులో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో  పాకిస్తాన్ పై విజయం సాధించిన భజనకీర్తనలే చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదంటూ సీపీఎం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు విమర్శించారు. ఈరోజు(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ టీడీపీ మహానాడు మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని భజన కీర్తనలకే పరిమితమైంది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడులకు  లొంగిపోయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పజెప్పకుండా, ఏ విషయం తేలకుండా మిగిలిపోయిన ఆపరేషన్ సిందూర్ ను మహానాడు వేదికగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను, ఎన్టీఆర్ ను పొగిడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే చర్యలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ సమయంలో గతంలో నరేంద్ర మోదీ చెంబెడు నీళ్లు, మట్టి తెచ్చారు.ఈసారి అది కూడా తేలేదు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు లేవు. రూ. 1500 కోట్ల నిధులు లేవు. అలాగే వాగ్దానాలు నెరవేర్చలేదు.

రాజధాని పేరుతో కార్పొరేట్ రాజధాని చేస్తున్నారు తప్ప.. ప్రజల రాజధాని కాదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మోదీని విమర్శించారు.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు మారిపోయింది. పవన్ ది నాలుక లేక తాటిమట్ట నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.. ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేశారు. 

కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లొంగుబాటు రాష్ట్రానికి తీరని లోటు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని గాలికి వదిలేసి 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పడం ఏంటి?,  టీడీపీ మహానాడు వైఫల్యాల పుట్ట. మహానాడులో ఇరగదీసింది ఏమీలేదు. మహానాడు ప్రజలపై భారం మోపేందుకు , పచ్చి అవకాశవాదంగా మార్చుకునేందుకు పెట్టారే తప్ప మహానాడుతో ఒరిగేదేమీ లేదు. అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదు’ అని హెచ్చరించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)