Breaking News

‘సీజ్‌ ద షిప్‌ అ‍న్న మీరు.. లారీలను సీజ్‌ చేయలేకపోతున్నారా?’

Published on Sun, 06/08/2025 - 15:25

విజయవాడ:  ఏపీలో రేషన్‌ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్‌ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు.  బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది. 

గతంలో పవన్‌ వెళ్లి సీజ్‌ ద షిప్‌ అన్నారు. పవన్‌ షిప్‌ను సీజ్‌ చేసినప్పుడు మీరు లారీలను సీజ్‌ చేయలేకపోతున్నారా?,  కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్‌ బ్యాంక్‌ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్‌(బీపీఎల్‌) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్‌ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్‌?,  

ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో,  డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది. 

ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. 

మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)