Breaking News

బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు: సీపీఐ నారాయణ

Published on Fri, 07/18/2025 - 12:48

సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల ఎలా కడతారు? అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారాయన. 

శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అనేది ప్రస్తుత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు,రాష్ట్రం ,కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారు. బనక చర్ల రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కాదు రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. 

అసలు.. చంద్రబాబు బనకచర్ల గురించి మొదట తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాల్సింది. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రాజెక్టులు ఎప్పుడైనా వివాద రహితంగా కట్టుకోవాలి. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలి. అంతేగానీ నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంతో సమానమే. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దు అని నారాయణ హితవు పలికారు. 

రేవంత్‌ గట్టొడు
టీఆర్‌ఎస్‌ బీఆర్ఎస్‌గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయింది. ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రేవంత్ తెలంగాణ సీఎం. ఆయన ఎన్నుకోబడిన నేత.. నామినేట్ చేయబడిన వ్యక్తి కాదు. తెలంగాణకి రేవంత్ అన్యాయం చేయలేదు. పొట్టివాడు గట్టి వాడు. అయితే.. రేవంత్ విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలి అని నారాయణ సూచించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)