Breaking News

కాంగ్రెస్‌కు షాక్‌! కోమటిరెడ్డి ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు కుంభం.. కారులో షి‘కారు’

Published on Mon, 07/24/2023 - 17:55

సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. నిన్న ఘట్ కేసర్ లో అనిల్ కు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. ఈనేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి భువనగిరిలో సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు.

తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకవర్గంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దెబ్బతినేలా ఎంపీ వెంకట్‌రెడ్డి గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు.

తన ఇంట్లోనే ఐదు ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని అనిల్‌ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టంగా ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సమయం లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారని కార్యకర్తల సమావేశంలో అనిల్‌ చెప్పుకొచ్చారు.
(బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్‌షాతో కరీంనగర్‌ ఎంపీ భేటీ, కీలక సూచన)

కారెక్కనున్న కుంభం
కాంగ్రెస్‌లో వర్గపోరుతో కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి జగదీష్‌ రెడ్డితోపాటు అనిల్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది.
(బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌)

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)