Breaking News

'ఉ‍త్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..'

Published on Sun, 01/08/2023 - 15:31

చండీగఢ్‌: హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు దక్షిణాది కంటే హిందీ రాష్ట్రాల్లోనే విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. హరియాణాలో జోడో యాత్రలో భాగంగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈమేరకు మాట్లాడారు.

'కేరళలో భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు విశేష స్పందన వచ్చింది. కానీ బీజేపీ పాలిత కర్ణాటకలో ఆదరణ ఉండదని అన్నారు. కానీ కన్నడ నాట ఇంకా ఎక్కువ మంది యాత్రకు తరలివచ్చారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టినప్పుడు అక్కడ యాత్ర ఫెయిల్ అవుతుందని అన్నారు. కానీ జనం ఇంకా భారీగా తరలివచ్చారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో యాత్రను ఆదరించరని అన్నారు. కానీ దక్షిణాది కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే లభిస్తోంది. ఈసారి కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు' అని రాహుల్ అన్నారు.

అలాగే తన గురించి బీజేపీ పట్టించుకుంటుందని, తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. తాను మాత్రం అసలు బీజేపీని పట్టించుకోనని స్పష్టం చేశారు. మన పని మనం చేసుకుంటే పోతే ఫలితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భగవత్‍గీత శ్లోకాన్ని గుర్తు చేశారు. అర్జునుడు చేప కంటికి గురిపెట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడో చెప్పలేదని పేర్కొన్నారు.

బీజేపీ దేశాన్ని విద్వేషం, మతం ప్రాదిపదికన విడదీస్తోందని, కాంగ్రెస్ చరిత్రలో ఎనాడూ ఇలా చేయలేదని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించి దేశాన్ని ఏకం చేయడానికే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ మరోమారు స్పష్టం చేశారు.
చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)