Breaking News

‘మా అబ్బాయి ఓడిపోవాలి’.. కేంద్ర మాజీ మంత్రి

Published on Tue, 04/09/2024 - 14:18

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోక్‌సభ ఎన్నికలో ఓటమిపాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏకే ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోని బీజేపీ తరఫున పతనంతిట్ట పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని మంగళవారం మీడియాతో మాట్లాడారు.

‘నా కుమారుడు అనిల్‌ ఆంటోని అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ పతనంతిట్ట సెగ్మెంట్‌లో ఓడిపోతుంది. అక్కడ నా కుమారుడు అనిల్‌ ఆంటోని ఓడిపోవాలని ఆశిస్తున్నా.  అదేవిధంగా కేరళ సౌత్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ గెలుస్తారు. కాంగ్రెస్‌ నేతల పిల్లలు బీజేపీ చేరటం చాలా పెద్ద తప్పు.

..కాంగ్రెస్‌ పార్టీనే నా మతం. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ... ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పోరాడుతోంది. సీఎం పినరయి విజయన్‌ చేసే ఆరోపణలను కేరళ ప్రజలు అంత సీరియస్‌ తీసుకోరు. ఆ మాటలను కేరళ ప్రజలు అస్సలు నమ్మరు’ అని ఏకే ఆంటోని అన్నారు. బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని..ప్రతిపక్షాల ఇండియా  కూటమికి  ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏకే ఆంటోని జోష్యం చెప్పారు. ఇ‍క.. 2023లో అనిల్‌ ఆంటోని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)