Breaking News

ఇక్కడ కాంగ్రెస్‌ ప్రచారం ‘నోటా’కే..

Published on Fri, 05/03/2024 - 14:24

ఇండోర్ (మధ్యప్రదేశ్‌): లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.

ఇండోర్‌ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.

“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్‌ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.

తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)