Breaking News

జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

Published on Mon, 06/24/2024 - 15:41

సాక్షి,జగిత్యాల జిల్లా:  తెలంగాణలో సీఎం రేవంత్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో జగిత్యాల జిల్లా  కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. తన ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ ల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సోమవారం ఆయన  ఇంటికి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఆది శ్రీనివాస్‌ చేరుకున్నారు. 

అక్కడికి చేరుకోగానే వారిద్దరినీ కాంగ్రెస్ శ్రేణులు, జీవన్‌రెడ్డి క్యాడర్‌ చుట్టుముట్టింది. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై విప్స్ ఇద్దరినీ కార్యకర్తలంతా నిలదీశారు.  సాయంత్రం ఐదు గంటల తర్వాత జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ చేయనున్నట్లు సమాచారం. 

కాగా, జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో మరో ప్రత్యర్థినేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్‌రెడ్డి అలకబూనారు. అవసరమైతే తన  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్‌రెడ్డి సిద్ధమయ్యారు. 

దీనిపై ఆయనను బుజ్జగించేందుకే పార్టీ తరపున ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, లక్ష్మణ్‌కుమార్‌లు జీవన్‌రెడ్డి  ఇంటికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్‌కుమార్‌ మీద జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.   

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)