Breaking News

గత పదేళ్లలో కాంగ్రెస్‌ సాధించిందేమిటి? ఎందరు పార్టీని వీడారు?

Published on Mon, 04/08/2024 - 09:37

దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పదేళ్ల పార్టీ లెక్కలను పరిశీలిస్తే.. 2014 నుంచి నేటివరకూ 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు 50 మందికి పైగా బడా నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. 

ఈ నేతలంతా తాము కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ నాయకత్వం, పనితీరులో లోపమే కారణమని చెబుతున్నారు. వీరు పార్టీని వీడిన ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన పదేళ్లలో లోక్‌సభ, అసెంబ్లీతో కలిపి మొత్తం 51 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిని చవిచూసింది. 

ఇటీవలే మిలింద్ దేవరా, గీతా కోడా, బాబా సిద్ధిఖీ, రాజేష్ మిశ్రా, అంబ్రిష్ డెర్, జగత్ బహదూర్ అన్నూ, చంద్మల్ జైన్, బసవరాజ్ పాటిల్, నరన్ రథ్వా, విజేందర్ సింగ్, సంజయ్ నిరుపమ్, గౌరవ్ వల్లభ్ తదితరులు కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 

ఇక కాంగ్రెస్‌ను వీడిన 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు బడానేతల విషయానికొస్తే ఈ జాబితాలో హిమంత బిస్వా శర్మ, చౌదరి బీరేందర్ సింగ్, రంజిత్ దేశ్‌ముఖ్, జికె వాసన్, జయంతి నటరాజన్, రీటా బహుగుణ జోషి, ఎన్ బీరెన్ సింగ్, శంకర్ సింగ్ వాఘేలా, టి. వడక్కన్, జ్యోతిరాదిత్య సింధియా, కేపీ యాదవ్, ప్రియాంక చతుర్వేది, పీసీ చాకో, స్తిన్ ప్రసాద్, జితిన్ ప్రసాద్ , లలితేష్ త్రిపాఠి, పంకజ్ మాలిక్, హరేంద్ర మాలిక్, ఇమ్రాన్ మసూద్, అదితి సింగ్, సుప్రియా అరోన్, ఆర్‌పీఎన్‌ సింగ్, అశ్విని కుమార్, రిపున్ బోరా, హార్దిక్ పటేల్, సునీల్ జాఖర్, కపిల్ సిబల్, కుల్దీప్ బిష్ణోయ్, జైవీర్ షెర్గిల్, అనిల్ ఆంటోనీ, సీఆర్‌ కేస్వానీ తదితరులు ఉన్నారు. 

గత పదేళ్లలో కాంగ్రెస్‌ ఓటమి పాలైన ఎన్నికలు..
లోక్ సభ ఎన్నికలు: 2014, 2019
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు: 2017
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013,2023
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 2015, 2020
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014
సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
అసోం అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2019
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు: 2022
మిజోరం అసెంబ్లీ ఎన్నికలు: 2018
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు: 2023
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
గోవా అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 2018
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 2018
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
కేరళ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: 2022
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)