Breaking News

కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ షాక్‌.. ఆ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌కి ‘నో’

Published on Wed, 10/09/2024 - 20:22

హర్యానా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హస్తం పార్టీ ఓటమిపై ప్రతిపక్ష బీజేపీతోపాటు మిత్రపక్షాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), ఆప్‌, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. 

కాంగ్రెస్‌ అతి విశ్వాసం, అహంకారమే ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణమని మండిపడితున్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీ చేయలేదని, కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, లేక ఆప్‌తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. ఈ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది.  అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ.. ఆ ప్రపోజల్‌ను ఎస్పీ తిరస్కరించింది.

తాజాగా ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కర్హల్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము నుంచి నసీమ్ సోలంకి, ఫుల్‌పూర్ (ప్రయాగ్‌రాజ్) నుంచి ముస్తఫా సిద్దిఖీ, మిల్కిపూర్ (అయోధ్య) నుంచి అజిత్ ప్రసాద్‌కు, కతేహరి నుంచి శోభావాయ్ వర్మ, మజ్వాన్ స్థానం నుంచి జ్యోతి బింద్‌లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే వీటి పోలింగ్‌కు ఇంకా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించలేదు

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)