Breaking News

కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి జగ్గారెడ్డి?

Published on Thu, 08/17/2023 - 10:37

సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్‌ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ సర్కార్‌ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నా​యి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్‌ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్‌ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్‌ను అభినందించడం విశేషం. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ సార్‌ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్‌..!

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)