Breaking News

బీఆర్‌ఎస్‌ పాలనలో యువత భవిష్యత్తు నాశనం

Published on Thu, 11/16/2023 - 03:29

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్‌ అసమర్థ పాలనలో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని, విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి, సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగ పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోవడంతో రాష్ట్ర యువత నిర్వి ర్యం అయిపోతోందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం పది అంశాలతో కూడిన యూత్‌ చార్జిషీట్‌ను విడుదల చేసింది.  

యూత్‌ చార్జిషీట్‌లోని అంశాలివే.. 
♦ దేశంలోనే విద్యారంగానికి తెలంగాణలో కేటాయింపులు తక్కువ. 2014–15లో రాష్ట్ర బడ్జెట్‌లో 10.98 శాతం నిధులు విద్యకు కేటాయించగా, 2023–24లో 7.6 శాతానికి తగ్గించారు.  
♦ కేజీ టు పీజీ విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కొత్త తరగతి గదిని కూడా నిర్మించలేదు. ఒక్క గంభీరావుపేటలో మాత్రమే కేజీ టు పీజీ క్యాంపస్‌ను నిర్మించారు.  
♦ సీఎస్‌ఆర్‌ నిధులతో ఒక్క తరగతి గదినయినా కట్టించాలని కార్పొరేట్‌ కంపెనీలను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.  
♦  ప్రతి ఇంటికీ ఉద్యోగం అని కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో ఈ 60 శాతం సర్కార్‌ నడుస్తోంది.  
♦ ఉద్యోగ పరీక్షలు రాసే లక్షలాది మంది యువత విశ్వాసాన్ని టీఎస్‌పీఎస్సీ కోల్పోయింది.  
♦ పదో తరగతి నుంచి టీఎస్‌పీఎస్సీ పరీక్షల వరకు నిర్వహణ వైఫల్యంతో 2014–21 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  
♦జాబ్‌ కేలండర్‌ లేకపోవడంతో ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు.  
♦ రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలుండటంతో వేలాది మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు సరి్టఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదు.
♦యూనివర్సిటీల్లో 2/3వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను నాశనం చేస్తున్నారు. 
♦కేసీఆర్‌ అసమర్థ పాలనతో యువత మద్యానికి, డ్రగ్స్‌కు, జూదానికి బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనమవుతోంది.   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?