Breaking News

చంద్రబాబు విడుదల కాలేరు: రఘువీరారెడ్డి వ్యాఖ్యలు

Published on Fri, 09/29/2023 - 18:42

సాక్షి, సత్యసాయి జిల్లా: స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, రఘువీరా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం 2017లో​ గుంటూరులో సభ నిర్వహిస్తే చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించారు. కోర్టులో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి. చంద్రబాబు అరెస్ట్‌లో టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కాలేరు. ఆయన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారు. తాను తవ్విన గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. 

సీడబ్ల్యూసీ సభ్యుడిగా రఘువీరా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రఘువీరారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రెండు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన అనంతరం రాజకీయాలకు దూరమైపోయారు. సొంతూరిలోనే సాధారణ జీవితం గడిపారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అనూహ్యంగా రఘువీరారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా రఘువీరారెడ్డి మళ్లీ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పార్టీ ఎన్నికల పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఆనాడే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన బాధ్యతలను రఘువీరారెడ్డి చిత్తశుద్ధితో నెరవేర్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధిష్టానం వద్ద రఘువీరారెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా సీడబ్ల్యూసీ సభ్యుడిగా రఘువీరారెడ్డి నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: లోకేష్‌ లోకేషన్‌ ఎక్కడ? కార్లు మారుస్తూ రహస్య మీటింగ్‌లు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)