Breaking News

ప్రధాని పదవిపై ఆసక్తి లేదు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు..

Published on Tue, 07/18/2023 - 15:20

బెంగుళూరు వేదికగా మంగళవారం రెండో రోజు విపక్షాల ఐక్యత భేటీ జరిగింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్‌ సహా 26 ప్రతిపక్ష పార్టీలు, అగ్ర నేతలు హాజరయ్యారు. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణ, తదితరాలపై కూటమి కీలక చర్చలు జరిపారు. ఈ క్రమంలో విపక్షాల భేటీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీకి ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారం కోసం పాకులాడటం లేదని, దేశ రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం, లౌకిక విలువ‌లు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకే తామంతా క‌లిశామ‌ని ఖ‌ర్గే పేర్కొన్నారు. 
చదవండి: విపక్షాల భేటీ.. మహాకూటమి పేరు ఇదే..!

‘కాంగ్రెస్‌కు అధికారం లేదా ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చెన్నైలో స్టాలిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చెప్పాను. ఆ వ్యాఖ్య‌ల‌కు మేము క‌ట్టుబ‌డి ఉన్నాం. ప్రస్తుతం ఈ భేటీలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీ స్వయంగా 303 స్థానాల్లో గెలుపొందలేదు. అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకున్న కాషాయ పార్టీ.. ఆ తర్వాత వారిని విస్మరించింది’ అని ఖర్గే మండిపడ్డారు. 

మరోపక్క విపక్షాల భేటీకి దీటుగా ఎన్డీయే మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఏకంగా 38 మిత్రపక్షాలతో కలిసి మెగా పోటీ భేటీ తలపెట్టింది. ఈ సమావేశంలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్‌ మోర్చా వంటి కొత్త పార్టీలు పాల్గొంంటాయని ఇప్పటికే బీజేపీ వెల్లడించింది. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇక హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగుతున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)