Breaking News

భారత్‌ గురించి మీకు చెబుతా.. మనీష్‌ తివారీ నర్మగర్భ వ్యాఖ్యలు

Published on Wed, 07/30/2025 - 09:02

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకత్వం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఎంపీ మనీశ్‌ తివారీ సామాజిక మాధ్యమాల్లో నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 1970లనాటి సినిమా పాటను జోడించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తివారీ.

మంగళవారం తివారీ ఎక్స్‌లో.. ఆపరేషన్‌ సిందూర్‌ చర్చలో ఎంపీలు శశి థరూర్, మనీష్‌ తివారీలకు కాంగ్రెస్‌ అవకాశమివ్వలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని జోడిస్తూ.. మనోజ్‌ కుమార్‌ నటించిన పూరబ్‌ ఔర్‌ పశ్చిమ‌ సినిమాలోని ‘భారత్‌ కా రెహ్నా వాలా హూ, భారత్‌ కీ బాత్‌ సునాతా హూ’ అనే పాటను ఉటంకించారు. భారత వాసులారా.. భారత్‌ గురించి మీకు చెబుతా.. అని దీనర్థం. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం విదేశాలకు పంపించిన దౌత్య బృందాల్లో భాగస్వాములుగా ఉన్న థరూర్, తివారీలకు పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడే అవకాశముందంటూ వార్తలు రావడం తెల్సిందే.

అయితే, వీరిద్దరికీ కాంగ్రెస్‌ మాట్లాడే అవకాశమివ్వలేదు. దీనిపై ఎంపీ తివారీ త్రివర్ణ పతాకం కనిపిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. 1970లనాటి సినిమా పాటను జోడించారు. అనంతరం పార్లమెంట్‌ వెలుపల మీడియా ఈ వ్యాఖ్యలపై అర్థమేంటని అడగ్గా.. ‘ఆంగ్లంలో ఓ సామెతుంది..‘నా మౌనాన్ని అర్థం చేసుకోలేకుంటే.. నా మాటలను సైతం ఎన్నటికీ అర్థం చేసుకోలేవు’ అంటూ స్పందించారు. ఆ పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రశ్నించగా.. జర్నలిస్టులు కదా పరిశోధించండి’ అంటూ దాటవేశారు. తన వ్యాఖ్యలకు అర్థాన్ని మాత్రం వివరించలేదు.

అయితే, తివారీ తనకు లోక్‌సభలో మాట్లాడే అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా, కాంగ్రెస్‌ వర్గాలు శశిథరూర్‌కు మాట్లాడే అవకాశమిచ్చానా ఆయన మాత్రం మరో అంశంపై మాట్లాడుతానని తెలిపినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అనంతర పరిణామాలు, కేంద్రం చర్యలపై ఈ ఇద్దరు ఎంపీలు ప్రభుత్వాన్ని సమర్థించడంపై కాంగ్రెస్‌ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు వార్తలు రావడం తెల్సిందే.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)