Breaking News

‘మోదీజీ.. ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించండి’

Published on Thu, 05/22/2025 - 11:37

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ గత 11 రోజుల్లో ఎనిమిది సార్లు భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల ఒప్పందాన్ని తానే కుదిర్చినట్టు చెప్పారు. భారత్‌ను తానే ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ట్రంప్‌ ఇదే చెబుతున్నారు. కానీ, ఆయన స్నేహితుడు ప్రధాని మోదీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మన విదేశాంగ మంత్రి కూడా ఏం మాట్లాడటం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. అంటే భారత్‌, పాకిస్తాన్ ఒకే పడవలో ఉన్నాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ చెప్పినప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన ఈ సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారు’ అని ఆరోపించారు.

ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌ విషయమై అఖిలపక్ష ప్రతినిధుల బృందంపై జైరాం రమేష్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్ము, కశ్మీర్‌లోనే తిరుగుతున్నారు. వీరందరూ గత 18 నెలల్లో మూడు ఉగ్రవాద దాడులకు కారణమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఇలాంటిదేమీ లేకుండా.. ఎంపీలందరూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎంపీలను ఇతర దేశాలకు పంపడం ఎందుకు?. మేము అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?. పార్లమెంట్ సమావేశం జరగాలి. ప్రధానమంత్రి ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాలకు హాజరు కారు. ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వరు అని విమర్శలు చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)