అప్పు చేసి రుణమాఫీ చేశాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

Published on Mon, 01/06/2025 - 14:52

సాక్షి,జగిత్యాల జిల్లా: అప్పు చేసి మరీ రెండు లక్షల రుణమాఫీ చేశామని,రైతుభరోసా కూడా రెండు పంటలకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు. సోమవారం(జనవరి 6) జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతు భరోసా రెండు పంటలకు రూ. 12 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12000 ఆర్థిక భరోసా ఇస్తాం. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని మంచి చేస్తే హర్షించాలి. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తాం. ఏక మొత్తంగా రుణ మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రైతులకు రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో  రుణమాఫీ చేయలేక చేతులెత్తేసింది. కేసీఆర్  రుణమాఫీ  చేయలేక ఎన్నికల ప్రణాళికలో కూడా రుణమాఫీ అంశాన్ని చేర్చలేదు. 

సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే చేయలేదంటారు. చేస్తేనేమో విమర్శిస్తారు.పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారా..వద్దనుకుంటున్నారా..?పంజాబ్ లో 33 నెలల్లో 50 వేల ఉద్యోగాలను గొప్పగా  చెప్తున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో  12 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని జీవన్‌రెడ్డి తెలిపారు. 

ఇదీ చదవండి: మీరెన్ని కేసులు పెట్టినా భయపడం

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)