Breaking News

బీఆర్‌ఎస్‌ది వడ్డీ మాఫీనే.. దొంగ దీక్ష అందుకే: జీవన్‌రెడ్డి

Published on Fri, 01/17/2025 - 13:54

సాక్షి, హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.  అలాగే, తెలంగాణ ప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వడమే మర్చిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని తెలిపారు.

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. వడ్డీ మాఫీ మాత్రమే చేసింది. వరంగల్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. మేము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతల ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో  దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోంది. రైతు భరోసా పేరుతో  ఈనెల 26 నుండి రైతుకు ప్రోత్సాహం కింద ఎకరాకు 12 వేలు ఇస్తుంది. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద 12వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. బీఆర్ఎస్ రైతుబంధు పేరుతో ఏడాదికి 8వేల నుండి పది వేలు చేస్తే.. కాంగ్రెస్ పది వేల నుండి 12 వేలు ఇస్తుంది. భవిషత్తులో 14 వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది.

దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు 500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు సన్నాలు పండిస్తే రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26నుండి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ హౌసింగ్‌ పథకాన్ని మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేలా ప్రణాళిక చేసింది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ రుణమాఫీ అంశాన్నే ఎత్తేసింది. బీజేపీ రుణమాఫీ అనే మాటే ఎత్తలేదు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పేటెంట్ అంటే అది కాంగ్రెస్ మాత్రమే’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)