Breaking News

కుట్రలతో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ఆవేదన

Published on Sat, 12/02/2023 - 14:41

సాక్షి, ములుగు: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్‌ జరుగనుంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటిక ఎగ్జిట్‌పోల్స్‌ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. దీంతో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, సీతక్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి ఇంటా వెలుగులే. బీఆర్‌ఎస్‌ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఆడబిడ్డగా ములుగు ప్రజలు ఆదిరించారు. చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. నా జీవితానికి ఇంకేం కావాలి. నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు. నేనెప్పుడూ మీ సేవకురాలినే.

నేను ములుగు ప్రజల వెంటే ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను. నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నాను. వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు. వారికి ఆడబిడ్డ ఉసురు తగులుతుంది. నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నా కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటాను. పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తాను. ఎన్నికల్లో కష్టపడ్డ అందరికీ కృతజ్ఞతలు అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)