Breaking News

మరి బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?.. కాంగ్రెస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Sun, 04/23/2023 - 16:57

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా మరోసారి పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌పై కాంగ్రెస్‌ నేత మల్లు రవి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఈటల రాజేందర్‌ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. 

కాగా, మల్లు రవి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని రాజకీయ వేదిక చేసి గుడి చుట్టూ రాజకీయాలు నడిపింది బీజేపీ కాదా?. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేసినప్పుడు బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?. కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండవు. రాజకీయం కోసం అబద్ధాలతో గడుపుతున్నారు. బీజేపీ నేతలు చేసే ప్రతీ ప్రకటన అబద్ధాలతో కూడుకున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు గత పదేళ్లుగా నడుస్తున్నవే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా, అంతకు ముందు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈటల మాట్లాడుతూ.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశాను. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు.' అని ఈటల ఫైర్ అయ్యారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలకో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)