Breaking News

‘తెలంగాణలో ఏపీ తరహా వ్యూహం.. బీజేపీ వదిలిన బాణమే కవిత’

Published on Mon, 06/02/2025 - 11:43

సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు మధు యాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. బంగారు బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ జాగృతిలో 800 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ నాయకులు మధుయాష్కీ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘బీజేపీ వదిలిన బాణమే కవిత. ఒక మహిళగా రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీలో కూడా ఆమె కుంభకోణం చేశారు. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే కొత్త డ్రామాకు తెర లేపారు. తెలంగాణ జాగృతిలో భారీ స్కాం జరిగింది. జాగృతిపై విచారణ జరపాలి. రాజీవ్ ప్రతాప్ రుడి పదవి పోవడానికి జాగృతి సంస్థ కారణం. జాగృతి సంస్థ అవినీతిలో కూరుకుపోయింది.

తెలంగాణలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని కార్పొరేట్ సంస్థల దగ్గర జాగృతి డబ్బులు వసూలు చేసింది. జాగృతి దోపిడీకి అన్ని కార్పోరేట్ సంస్థలు బలయ్యాయి. కవిత మాఫియా డాన్. ఆమె చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదు. కవిత ఏ వ్యాపారం చేసిందని జూబ్లీహిల్స్‌లో రెండు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తుంది. బీఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ పొందాలనుకుంటుంది.. అందుకే  కవితను రంగంలోకి దింపింది. లిక్కర్ కేసు నుండి బయటపడటం కోసం కవిత బీజేపీకి పనిచేస్తోంది.

అవినీతి సొమ్ము దాచుకోవడానికే జాగృతి బలోపేతం అంటుంది. బీసీలకు న్యాయం చేస్తా అన్న కవిత.. జాగృతికి ఎందుకు అధ్యక్షురాలిగా ఉంది. జాగృతి అధ్యక్షురాలిగా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసింది జయశంకర్.. కేసీఆర్ కాదు. ముఖ్యమంత్రి పదవి కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో  చేరాడు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోపిడిలో ఏంతో మంది బలయ్యారు. ఎంపీ సంతోష్ ఇప్పుడు ఎందుకు చెట్లు నాటడం లేదు.. పదేళ్లు చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కేటీఆర్‌కు అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి. వాటి లెక్కలు చూసుకోవడానికే కేటీఆర్‌ అమెరికాకు వెళ్లారు. ఏపీ తరహా వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ తిట్టుకున్నాయి.. ఎన్నికల నాటికి రెండు కలసి పోటీ చేశాయి. తెలంగాణలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)