Breaking News

రేవంత్‌ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పరాభవం!

Published on Sat, 11/23/2024 - 12:17

సాక్షి, హైదరాబాద్‌: మ‌హారాష్ట్ర‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ ప్ర‌చారం చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. రేవంత్ ప్ర‌చారం నిర్వ‌హించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్‌, చంద్రాపూర్, భోకార్, నాయ‌గావ్‌, నాందేడ్ నార్త్‌లో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం దిశ‌గా దూసుకెళ్తున్నారు. 

కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్‌ తగిలింది. హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.

జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్‌ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు.
 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)