Breaking News

అందుకే వాళ్లు మా పార్టీ నుంచి వెళ్లిపోయారు..కేసీ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 04/08/2024 - 14:46

తిరువనంతపురం : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందిన వెంటనే కొందరు నేతలు పార్టీ నుంచి వైదొలిగి, ‘బీజేపీ, కేంద్ర ప్రభుత్వ కాళ్లపై పడ్డారు’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు.

కేరళ కాంగ్రెస్‌ ఆలప్పుళ లోక్‌సభ అభ్యర్ధి కేసీ వేణుగోపాల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీ వేణుగోపాల్‌ తరుపున ప్రచారం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సైతం హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా కేసీ వేణుగోపాల్‌ డీకే శివకుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

డీకే శివకుమార్‌ను అన్యాయంగా
బీజేపీ, దర్యాప్తు సంస్థలు పలురు నేతల్ని లేఖలతో బెదిరిస్తున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ డీకే శివకుమార్‌లాంటి గట్స్‌ ఉన్న నేతలు బీజేపీ,ప్రభుత్వ ఏజెన్సీల ఒత్తిడిలకు తలొగ్గలేదని కొనియాడారు. కారణం లేకుండా కేంద్ర ఏజెన్సీలు డీకే శివకుమార్‌ను అన్యాయంగా జైలుకు పంపాయని, అయినప్పటికీ ధైర్యంగా పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు.

ఎంతోమంది నేతలు పార్టీని వీడే సమయంలో దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నోటీసులకు బయపడి బీజేపీకి సరెండర్‌ అవుతున్నారన్న ఆయన.. డీకే మాత్రం తన తల్లిలాంటి కాంగ్రెస్‌ను వదల్లేదని తెలిపారు. 

ధైర్యంగా ఎదుర్కొని
కారణం లేకుండానే శివకుమార్‌ తీహార్‌ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్‌ పార్టీని వీడాలని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. పార్టీని వదిలేస్తే జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆ చెప్పింది ఎవరో నాకు బాగా తెలుసు. కానీ శివకుమార్‌ కాంగ్రెస్‌ తనకు తల్లిలాంటిదని, పార్టీని వదిలే ప్రసక్తి లేదని తేల్చి  చెప్పినట్లు వెల్లడించారు. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)