Breaking News

బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు?

Published on Thu, 04/04/2024 - 05:12

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇండియన్‌ టెలికం యాక్ట్‌పై కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సుమోటోగా స్వీకరించొచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? ఆ పార్టీ నేతలు అవగాహన రాహిత్యంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ..పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వెనుక ఉన్న వారు ఎంతటి పెద్దమనుషులైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుని పోతోంది’అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు స్పష్టం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్‌ నిర్వహించ తలపెట్టిన జనజాతర మహాసభ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

పూర్తి వివరాలు వారి మాటల్లోనే...బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించింది. మా ఫోన్లు కూడా ట్యాప్‌ చేసింది. వీటిని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడింది. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్లు పేరుతో తిన్న కమీషన్లు కక్కిస్తాం. ధరణి ఫోర్టల్‌ను అడ్డుపెట్టుకొని వారు కొల్లగొట్టిన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్‌ భూములను వెనక్కి తీసుకుంటాం. ఆర్థిక దోపిడికి పాల్పడిన వారికి జైలుకు పంపిస్తాం. కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో.. మీరు మా తాట తీయడం కాదు.. ప్రజలే మీ తాట తీస్తారు అని హెచ్చరించారు.  

కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాలే 
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది..కరువొచ్చిందని బీఆర్‌ఎస్‌ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కరువుకు కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటీ? కాంగ్రెస్‌ డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు వర్షపు చినుకు కురవలేదు. వర్షాకాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సెపె్టంబర్‌ 5న త్రిసభ్య కమిటీ ప్రకటించింది.

ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని కేఆర్‌ఎంబీ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌ పాలనలో కరువొస్తే...కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలివైనవారు. ఎవరు ఏమిటో వారికి తెలుసు. ఇప్పటికే ఒకసారి కర్రుకాల్చి వాతపెట్టారు. అయినా సిగ్గురాలే. మళ్లీ వారికి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  

జనజాతరకు భారీగా తరలిరావాలి 
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే స్ఫూర్తితో ఇదే వేదికపై నుంచి ఈ నెల 6న కాంగ్రెస్‌ జాతీయ గ్యారంటీలను ప్రకటించనుంది. ఏఐసీసీ ముఖ్యనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఐదు లక్షల మందికి తగ్గకుండా సభకు తరలించాలని నిర్ణయించింది. సభలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. వారికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం’అని మంత్రులు వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్‌ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)