Breaking News

అంబేద్కర్‌ వల్లే మోదీ, అమిత్‌ షాకు పదవులు: జగ్గారెడ్డి

Published on Fri, 12/20/2024 - 13:03

సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్‌ చేశారు.

తాజాగా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు.  పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్  గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.

అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ  అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ  చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)