Breaking News

ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి

Published on Tue, 01/07/2025 - 19:47

సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.

కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.

డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..
డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు