కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత
Breaking News
‘ప్రభుత్వానికి-గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవు’
Published on Sat, 08/01/2026 - 20:16
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి- గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని, అందులో చిన్న చిన్న సమస్యలు సహజమన్నారు. పార్టీకి-ప్రభుత్వానికి మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమే ఉందన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని, దాన్ని గ్యాప్ అనడం కరెక్ట్ కాదన్నారు.
కోఆర్డినేషన్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఢిల్లీలో జరిగిందన్నారు. తమ అంతర్గత పంచాయతీలలో ఇతరులు దూరితే వాళ్లకే నష్టమన్నారు పొంగులేటి. ధరణి టెండర్ నుంచి భూ భారతి వరకూ SET(ప్రత్యేక విచారణ బృందం) విచారణ చేస్తుందన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్లో బీఆర్ఎస్ ఎంత పెట్టింది - కాంగ్రెస్ ఎలా చేసింది లెక్కలు SET తీస్తుందన్నారు. రీ -సర్వే వల్ల 90శాతానికి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
Tags : 1