ఆరు గ్యారంటీలు.. నూరు సీట్లు!

Published on Sun, 10/22/2023 - 02:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల కోసం లండన్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుంది. ‘‘ఆరు గ్యారంటీలు–నూరు సీట్లు’ పేరు తో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ ఎన్నారై సెల్‌ (యూకే) ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్‌లో చేప ట్టారు. దీనిని గాంధీభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలు, నూరు గ్యారంటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని.. విదేశాల్లో ఉన్న వారి బంధువులు, సన్నిహి తులు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కృషి చేసే లా తోడ్పడాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని యువత, మహి ళలు, రైతులకు ప్రాధాన్యం ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. గల్ఫ్‌ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్‌ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీ లిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ గంప వేణుగోపాల్‌ నేతృత్వంలో జరిగిన కార్య క్రమంలో ఎన్నారై సెల్‌ నేతలు రంగుల సుధా కర్‌ గౌడ్, బిక్కుమండ్ల రాజేశ్, మంగళారపు శ్రీధర్, గంగసాని ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)