Breaking News

ఆ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఫ్లాప్‌ షో.. ఎందుకిలా? అవే కారణాలా?

Published on Thu, 03/10/2022 - 17:13

ఢిల్లీ: వచ్చే సార్వతిక ఎన్నికలకు సెమీస్‌గా సాగిన ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఉత్తరాఖండ్‌లో ప్రభావం చూపని ఆ పార్టీ.. పంజాబ్‌లో అధికారం పోగొట్టుకుంది. యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో మళ్లీ బీజేపీ పాగావేసింది. యూపీలో కాంగ్రెస్‌ అడ్రస్‌లేకుండా పోయింది. ప్రియాంకగాంధీ కూడా కాంగ్రెస్ హస్తవాసిని మార్చలేకపోయింది. సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ఫలితం కనిపించలేదు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు అయ్యింది. ప్రధానంగా పంజాబ్‌ నుంచి అవమానకర రీతిలో ఓటమి పాలైంది. సిద్ధూ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం, చన్నీ సామాజిక వర్గ ఆదరణ.. రెండు అంచనాలూ ఘోరంగా విఫలం అయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌..
యూపీలో కాంగ్రెస్‌కు ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. అతిపెద్ద రాష్ట్రంలో పొతులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం, ప్రియాంకగాంధీ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోకపోవడం బలమైన నేతలు లేకపోవడం, అతి విశ్వాసం, జాతీయస్థాయిలోనే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ బలహీనపడటం, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోవడం, ఎన్నికల్లో కర్షక  హామీలు ఇవ్వలేకపోవడం వంటి కారణాలు చెప్పవచ్చు.

ఉత్తరాఖండ్‌..
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ హామీ, పేదలకు రూ.40వేల పథకం ఓటర్లను ఆకర్షించలే ఆకట్టుకోని 4 లక్షల ఉద్యోగాల హామీ కూడా ఓటర్లను ఆకట్టుకోలేదు. టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్‌ హామీ ఇవ్వకపోవడం వంటి కారణాలు కాంగ్రెస్‌ ఓటమికి ఓటమికి కారణాలుగా విశ్లేషించవచ్చు.

పంజాబ్‌..
పంజాబ్‌లో కాంగ్రెస్‌ భంగపాటుకు కారణాలను పరిశీలిస్తే.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి,  ప్రభుత్వ వ్యతిరేకత.. కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పంజాబ్‌ కాంగ్రెస్‌లో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్‌ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టి వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయితే, గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఆప్‌కే పట్టం కట్టారు.

పంజాబ్‌లో అధికారి మార్పిడి జరగాలని ఆప్‌ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్‌’హామీ కూడా వర్కవుట్‌ అయ్యింది. దీంతో పంజాబ్‌లో ఆప్‌ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్‌ పూర్తిగా ఢీలా పడిపోయింది.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)