Breaking News

మిగిలిన రెండు దశలకు కాంగ్రెస్‌ ప్రచారాస్త్రాలివే?

Published on Thu, 05/23/2024 - 08:36

దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. ఆరు, ఏడో దశ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ రెండు దశల్లోనూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని సమాచారం. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, పంజాబ్ కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమైనవి. ఈసారి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మెరుగైన  ఫలితాలు రాబడుతందని పార్టీ అంచనా వేస్తోంది.

ఈ నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన మూడు స్థానాల్లో పోటీ బీజేపీ, ఇండియా కూటమి మధ్యే   నెలకొంది. హర్యానా, హిమాచల్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మొత్తం 35 సీట్లు ఉన్నాయి. గతంలో వాటిలో 24 సీట్లు బీజేపీకి దక్కగా, రెండు సీట్లు ఎన్‌డీఏలో భాగమైన అకాలీదళ్‌కు దక్కాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు, ఆప్‌కు ఒక సీటు వచ్చాయి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెరుగైన పలితాలు సాధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే  ఈ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

ఢిల్లీలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌, ఆప్‌తో కలిసి పోటీకి దిగింది. దీంతో కాంగ్రెస్, ఆప్ నేతలు ‍ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసారి చీపురు గుర్తు బటన్‌ను నొక్కి, కేజ్రీవాల్‌కు ఓటు వేస్తానని రాహుల్‌ గాంధీ అన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్‌ను అడ్డుకునేందుకు ఇరు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి.

ఈ రెండు దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్యలు, అగ్నివీర్‌ అంశంపై దృష్టి పెడుతున్నదని సమాచారం. హర్యానాలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కురుక్షేత్ర సీటును ఆప్‌కి ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా  గట్టి పునాదిని ఏర్పర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రంలోని మహేంద్రగఢ్, పచ్కుల, సోనిపట్‌లలో మూడు ర్యాలీలు నిర్వహించారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)