డిఫెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ..!

Published on Sun, 01/07/2024 - 13:02

ఎంతో చరిత్ర కల్గిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ పొలిటికల్‌ డిఫెన్స్‌లో పడింది.  ప్రస్తుతం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్‌ అయోమయంలో పడింది. ప్రధానంగా చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందాలపై వస్తున్న విమర్శలతో కాంగ్రెస్‌ పార్టీ రక్షణాత్మక ధోరణితో ముందుకెళ్తోంది. ఇటీవల బెంగళూరులో చంద్రబాబుతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ మంతనాలు జరపడంతో కాంగ్రెస్‌ పార్టీ అందుకు వివరణలు ఇచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. 

‘మతతత్వ బీజేపీతో మాది రాజీలేని పోరాటం. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. బీజేపీతో కలిసి నడుస్తోంది వైసీపీ. ఏపీలో ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి పార్టీలతో కలిసి పోరాడుతాం’ అని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ వివరణ ఇచ్చుకున్నారు.

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో చంద్రబాబు సహకారం అందించగా, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తెలంగాణ బరిలో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు పోటీకి పెట్టలేదు. దీన్ని  సాకుగా చూపుతూ చంద్రబాబు.. తెలంగాణలో తాను చేసిన సాయానికి బదులుగా ఏపీలో సాయం చేయాలని శివకుమార్‌ను కోరారు. చంద్రబాబు అభ్యర్థనల మేరకు కాంగ్రెస్‌ పార్టీలోకి షర్మిలను తీసుకున్నారు డీకే శివకుమార్‌,

తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో ప్రకటించిన షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సామాజిక వర్గాలు ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులను తెలుగుదేశంకు అనుకూలంగా బరిలో దించేందుకు అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)