Breaking News

రేపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

Published on Fri, 04/12/2024 - 04:52

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మూడు ఎంపీ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ అధిష్టానం శనివారం ఓ నిర్ణయానికి రానుంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఈ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేతలను కలిసి.. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు. సీఈసీ సమావేశానికి ముందే ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే, రాహుల్‌లతో రేవంత్‌ భేటీ కానున్నట్టు తెలిసింది. భువనగిరిలో పార్టీ నిర్వ హించే బహిరంగ సభకు రావాలని అగ్రనేతలను రేవంత్‌ ఆహ్వానించనున్నట్టు సమాచారం.

మూడు స్థానాలపై ఉత్కంఠ
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకుగాను 14 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఎవరికి దక్కుతాయన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఖమ్మం టికెట్‌ ఇవ్వాలంటూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడి కోసం, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తన కుమారుడి కోసం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

వీరితోపాటు అదే జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు బీసీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కరీంనగర్‌ ఎంపీ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్‌ మల్లన్న పోటీపడుతున్నారు. ఇక హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో అలీ మస్కతీ పోటీ చేస్తారనుకున్నా.. ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు సమీర్‌ వలీఉల్లా పేరు వినిపిస్తోంది.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)