Breaking News

MLC elections: నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు

Published on Thu, 01/18/2024 - 12:38

హైదరాబాద్‌, సాక్షి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. నామినేషన్‌ దాఖలుకు నేడు ఆఖరి రోజు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌లు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు దాఖలు కాకుంటే.. ఓటింగ్‌తో పని లేకుండా వీళ్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకుంటే ఎమ్మెల్యేలు ఓటేయక తప్పదు.

ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు(డిసెంబర్‌ 9వ తేదీన) రాజీనామా చేశారు. దీంతో జనవరి 4వ తేదీన ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా ఓటింగ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

అయితే శాసనసభలో కాంగ్రెస్‌కు తగినంత సంఖ్యాబలం ఉండడంతో.. రెండూ తమ స్థానాల్లో గెలుపు ఖాయమని కాంగ్రెస్‌ ధీమాలో ఉంది. మరోవైపు వేర్వేరుగా షెడ్యూల్‌ విడుదల చేయడంతో.. వేర్వేరుగా ఓటింగ్‌ నిర్వహించాల్సి వస్తుండడంపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

ఈసీ షెడ్యూల్‌

  • జనవరి 4వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల
  • జనవరి 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • జనవరి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
  • జనవరి 19వ తేదీ నామినేషన్ల పరిశీలన 
  • నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22వ తేదీ వరకు గడువు
  • 2024 జనవరి 29వ తేదీన ఎన్నికల నిర్వహణ
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పోలింగ్..  అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి 
  • ఫిబ్రవరి 1 వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి

కాంగ్రెస్‌ అభ్యర్థుల బయోడేటా

1. పేరు : బల్మూరి వెంకట్‌/బల్మూరి వెంకట నర్సింగరావు  
తండ్రి: మదన్‌మోహన్‌రావు  
పుట్టిన తేదీ    : నవంబర్‌ 2, 1992 
విద్యార్హత: ఎంబీబీఎస్‌  
పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా 
కులం: ఓసీ (వెలమ)  


2. పేరు:  బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ 
తండ్రి: బి.గంగాధర్‌ గౌడ్‌ 
పుట్టిన తేదీ:  ఫిబ్రవరి 24, 1966 
విద్యార్హత: బీకామ్‌ 
పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా 
కులం: బీసీ (గౌడ)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)