Breaking News

పోలీసులకు రాజకీయాలతో పనేంటి.. భట్టి విక్రమార్క వార్నింగ్‌!

Published on Thu, 06/29/2023 - 13:46

సాక్షి, ఖమ్మం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రారంభమైన తన పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుందన్నారు. ఖమ్మంలో జనగర్జన పేరుతో ముగింపు సభ జరగబోతున్నట్టు తెలిపారు. అధికార మదాన్ని దించాడానికే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని స్పష్టం చేశారు. 

కాగా, భట్టి విక్రమార్క కూసుమంచిలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో జూలై 2న జరిగే సభకు రాహుల్‌ గాంధీ హాజరవుతారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇందిరాసాగర్‌, రాజీవ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌లపై దమ్ముంటే చర్చకు రావాలి. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపిందో చెప్పాలి. అభివృద్ధి అంటే కాంగ్రెస్‌ హయాంలో వేసిన రోడ్లకు మధ్యలో స్తంభాలు, రంగులు వేయడం కాదు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు పనిచేయాలి. పోలీసులు పాలేరు ఎమ్మెల్యే ఆదేశాలతో పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే చట్ట ప్రకారం చర్యలుంటాయి. 

సింగరేణిని ప్రయివేటు పరం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ఏమీ ఇవ్వకుండా  సున్నా చూపెట్టారు. పాలేరు శాసనసభ్యుడిని కాంగ్రెస్ గుర్తుపై గెలిపిస్తే కేసీఆర్ దగ్గర కాంట్రాక్టుల కోసం ఓట్లను  అమ్ముకున్నాడు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనుంటే కాంగ్రెస్ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారాలి. ప్రజాస్వామ్య ద్రోహి పాలేరు ఎమ్మెల్యే. మీరు వేసే ఓటుకు ఎవరు గౌరవిస్తారో వారికే ఓటు వేయండి. ఓటును అమ్ముకునే నాయకులను గ్రామాల్లోకి రానివ్వకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీలో పెను మార్పులు!.. కేంద్రమంత్రిగా బండి, కిషన్‌ రెడ్డి, ఈటలకు.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)