Breaking News

కామారెడ్డిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్‌ నేత కారుపై దాడి

Published on Sat, 02/21/2026 - 08:31

కామారెడ్డి అప్‌డేట్స్‌.. 

తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తా
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి

  • నాణ్యత లేకుండా పనులు చేస్తుంటే అడ్డుకున్నాను
  • మార్పు కోసం నా ప్రయత్నం
  • ప్రోటోకాల్ లేకపోయినా ఇంచార్జి మంత్రులతో కలిసి షబ్బీర్ అలీ రాజకీయం చేస్తున్నారు
  • కాలేజి భూముల్లో 140 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి
  • భూములను ఎవరు అమ్మలేదు.. లీజ్ అగ్రిమెంట్ మాత్రమే ఉంది
  • చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు
  • రక్షణ ఇవ్వాలని ఎస్పీ కి ఫిర్యాదు చేశాను
  • అవినీతి అక్రమాలు అడ్డుకున్నందుకే తన పై కక్షగట్టారు
  • భూముల విషయంలో సోమవారం కలెక్టర్‌ను కలుస్తా
  • నేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తా
  • అక్కడి నుంచే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేక పంపిస్తా

టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావును  అడ్డుకున్న పోలీసులు

  • కామారెడ్డి వెళ్లకుండా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావును అడ్డుకున్న పోలీసులు
  • హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అడ్డుకున్న పోలీసులు
  • ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్

  • బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇద్దరి నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా  కామారెడ్డి వెళ్ళకుండా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • కామారెడ్డి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

  • కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన  ఆర్మూరు ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి అరెస్ట్
  • అనుచరులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు


కామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 

  •    మరికాసేపట్లో కామారెడ్డికి చేరుకోనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
  •    కామారెడ్డి ఘటనపై మీడియాతో మాట్లాడనున్న రాంచందర్ రావు

కామారెడ్డిలో హైటెన్షన్‌..

  • కాంగ్రెస్‌ నేత కారుపై బీజేపీ కార్యకర్తల దాడి.
  • కారుకు నిప్పు పెట్టిన బీజేపీ కార్యకర్తలు.
  • కారు నుంచి మంటలు.
  • తోపులాటలో పోలీసులకు గాయాలు.

కామారెడ్డిలో టెన్షన్‌..

  • కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
  • ఆరోరా భూములపై చర్చకు రావాలన్న బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి.
  • ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు.
  • కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.
  • కాంగ్రెస్‌ నేత కారు ధ్వంసం.
  • ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు. 

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

  • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి
  • ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో కారు అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
  • మహేందర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.

శిశుమందిర్‌ స్కూల్‌ వద్ద హైటెన్షన్‌..

  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతల సవాల్‌తో శిశుమందిర్‌ స్కూల్‌ వద్ద హైటెన్షన్‌.
  • పోలీస్ భారీ బందోబస్తు  మధ్య బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అరెస్టు.
  • పట్టణంలోని శిశు మందిర్ పాఠశాల వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
  • కామరెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.

👉కామారెడ్డిలో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

👉కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్‌ విసిరారు. దీంతో, చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి.. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. దీంతో, కామారెడ్డి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)