Breaking News

మోదీపై పోటీ.. కమెడియన్‌ నామినేషన్‌ తిరస్కరణ

Published on Thu, 05/16/2024 - 07:57

లోక్‌సభ  ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్‌ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా వేసిన  నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్‌ను అనుకరించటం వల్ల ఫేమస్‌ అయిన శ్యామ్‌ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్‌ వేశారు. 

ఈ సెగ్మెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్‌ రంగీలా నామినేషన్‌ వేశారు. ఒక రోజు తర్వాత  ఆయన నామినేషన్‌ను తిర్కరించినట్లు​ ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్‌ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత  పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు.  రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్‌ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు  నామినేషన్‌ దాఖలు చేసినట్లు వెల్లడించారు.  ప్రస్తుతం శ్యామ్‌ రంగీలా నామినేష్‌ను తిరస్కరణకు గురైంది. 

దీనిపై బుధవారం శ్యామ్‌ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో  పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్‌ రంగీలా అన్నారు.

ఇక.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్‌ జిల్లాలోని మనక్‌తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్‌ సుందర్‌. యానిమేషన్‌ పట్టభద్రుడైన శ్యామ్‌ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్‌ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్‌ మిమిక్రీ చేశాడు. 

అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్‌ 2022లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్‌ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4 ఫలితాలు విడుదల కానున్నాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)