Breaking News

శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు: సీఎం జగన్‌

Published on Fri, 08/11/2023 - 13:07

సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు పొలిటికల్‌ కౌంటరిచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే.. నారా వారిదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయని అన్నారు. 

అది నారా వారి ఘన చరిత్ర..
అమలాపురంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులను సీఎం జగన్‌ జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..  2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారు. బాబు హయాంలో 14వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించామన్నారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే అని స్పష్టం చేశారు. అది వారి చరిత్ర.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి. 

ప్రతిపక్షాల ఫ్యూజులు ఔట్‌..
ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా?. మీ బిడ్డల భవిష్యత్‌ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?.  పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువుల్ని అడ్డుకున్నారు. 75ఏళ్ల చంద్రబాబు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?. ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారు. 

తనకు గిట్టని వారి అంతుచూస్తాడట..
చంద్రబాబు వంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరగదు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. ఇందు కోసమే చంద్రబాబు అధికారం ఇవ్వాలట. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నాడు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెదిరించాడు. చంద్రబాబు మాటంటే విలువ లేదు, విశ్వసనీయత లేదు. వీరికి కావాల్సింది.. దోచుకోవడం.. పంచుకోవడం. 

ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఎందుకివ్వాలి..
మొన్నటి పుంగనూరు ఘటన చేస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక​ రూట్‌లో పర్మిషన్‌ తీసుకుని ఇంకో రూట్‌లో వెళ్లాడు. 47 మంది పోలీసులకు గాయాలు చేశాడు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీసు కన్ను పోగొట్టాడు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారు. మీ బిడ్డకు మీరే ధైర్యం. మీకు మేలు జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర: సీఎం జగన్‌

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)