Breaking News

నాకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సముద్రానికి సెల్యూట్‌: సీఎం జగన్‌

Published on Sun, 03/10/2024 - 16:59

సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ  ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జనసందోహం నడుమ ప్రసంగించారాయన.  

మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్‌ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా.. దక్షిణ కోస్తా సిద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్‌ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)