కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వానం

Published on Sat, 06/01/2024 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ శుక్రవారం కేసీఆర్‌ను కలిశారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి జీఏడీ అధికారులతో కలిసి వెళ్లిన వేణుగోపాల్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌కు రాసిన లేఖను అందజేశారు.

అనంతరం వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవం అందరికీ పండుగ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని కేసీఆర్‌ను కోరాం. ఆయన మా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు’అని వెల్లడించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ ఈ వేడుకల్లో పాల్గొనేదీ లేనిదీ తెలియదని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)