Breaking News

అప్పుడు ఎంఐఎంకు పీఏసీ చైర్మన్‌ పదవి ఎలా ఇచ్చారు?: సీఎం రేవంత్‌

Published on Thu, 09/12/2024 - 17:56

సాక్షి, హైదరాబాద్‌: ఫిరాయింపులపై ఏ ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వ స్థిరత్వానికి మంచిదేనని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు.  ‘బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనని, కోర్టుల తీర్పులు తమకే మేలు చేస్తాయని చెప్పారు. 
చదవండి: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్‌ నేతల నిరసన

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)