Breaking News

త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం: సీఎం రేవంత్‌

Published on Tue, 07/09/2024 - 19:53

సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఎంతో మంది గెలిచినా సీఎం అయ్యే అవకాశం రాలేదని, ఆ అవకాశం తనకు మాత్రమే  వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అ‍న్నారు. ఆయన మంగళవారం మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

‘‘సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య, ఆరోగ్యలపై సమీక్ష చేశాం. కార్యకర్తల కష్టంతో కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2009లో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే జిల్లా అభివృద్ధిని విస్మరించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల ఆపకుండా చేయాలని అధికారులను ఆదేశించాను. నేను మీలో ఓ కార్యకర్తను. కేసీఆర్‌ను ఓడించడమే కాదు మోదీని ఢీకొట్టే వరకు పోరాడాలి. త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం. 

మిమ్మల్ని గెలిపించే భాద్యత మాది, మీ ఎమ్మెల్యేలది.  దేవాలయ, మార్కెట్ కమిటీ, గ్రంధాలయం కమిటీలను కష్టపడిన వారికే ఇవ్వాలి. మూడేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఆదరించిన వారిని గుర్తుపెట్టుకుంటా. కార్యకర్తల కష్టం వల్ల నేను ఈ స్ధాయికి వచ్చాను. వారిని విస్మరించను. గతంలో మా పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రాష్ట్రంలో కేసీఆర్  కనుమరుగవుతారు. 4 రోజులుగా ఢిల్లీలో కాలుకాలిన పిల్లిలాగా కేటీఆర్, హరీష్ రావు ప్రధానిని కలిసేందుకు తిరుగుతున్నారు. 

డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని  బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది గ్రూపు- 1 అధికారులను నియమించాలని మేం ప్రయత్నిస్తుంటే కొందరు దుర్మార్గులు కోచింగ్ సెంటర్ల కోసం పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పరీక్షలు వాయిదావేయాలని ఆర్ట్స్ కాలేజీ వద్ద దీక్ష చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫి చేసి తీరుతా’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)